గురువారం 21 జనవరి 2021
National - Nov 26, 2020 , 15:28:34

ఆటో-లారీ ఢీ.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

ఆటో-లారీ ఢీ.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

ఫిరోజాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఫిరోజాబాద్‌-ఫ‌రీహా ర‌హదారిపై ఎదురెదురుగా వ‌స్తున్న ఆటో-లారీ ఢీకొన్నాయి. ఆటో పూర్తిగా లారీ కింద‌కు దూసుకెళ్ల‌డంతో అందులో ఉన్న ముగ్గురు మ‌హిళ‌లు, ఒక చిన్నారి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో వ్య‌క్తికి తీవ్ర‌గాయాల‌య్యాయి. న‌ర్ఖి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని భూతేశ్వ‌ర్ టెంపుల్ స‌మీపంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్ర‌మాద స్థ‌లానికి చేరుకుని ఆటో పూర్తిగా లారీ కింద ఇరుక్కోవ‌డంతో క్రేన్‌తో బ‌య‌టికి తీయించారు. ఆ త‌ర్వాత ఆటోలోని మృత‌దేహాల‌ను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. గాయ‌ప‌డిన వ్య‌క్తిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు పరారీలో ఉన్న లారీ డ్రైవ‌ర్ కోసం గాలిస్తున్న‌ట్లు తెలిపారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo