ఆదివారం 29 మార్చి 2020
National - Feb 13, 2020 , 02:52:06

దళిత బాలికపై సామూహిక లైంగికదాడి

దళిత బాలికపై సామూహిక లైంగికదాడి
  • 6 నెలలుగా పది మంది యువకుల అఘాయిత్యం

సోలాపూర్‌: దళిత సామాజిక వర్గానికి చెందిన బాలిక(16)పై సామూహిక లైంగికదాడి జరిగింది. పది మంది యువకులు ఆరు నెలలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. గుడి వద్ద ఏడుస్తున్న బాలికను గమనించిన కొందరు పోలీసులకు తెలిపారు. వారు ఆరాతీయగా.. స్నేహితులైన ఐదుగురితోపాటు మరో ఐదుగురు వ్యక్తులు తనను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి ఆరు నెలలుగా లైంగికదాడి చేస్తున్నట్లు తెలిపింది. నిందితుల్లో ఐదుగురిని  అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 
logo