సోమవారం 30 మార్చి 2020
National - Mar 10, 2020 , 14:47:34

బెంగళూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌

బెంగళూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌

బెంగళూరు: బెంగళూరులో కొత్తగా 4 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో కోవిడ్‌-19 నలుగురికి ఉన్నట్లు నిర్దారించామని, వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఉంచి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, వైరస్‌ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు కర్ణాటక ప్రభుత్వం మీడియా బులెటిన్‌ను విడుదల చేస్తున్నది. కరోనా సమాచారంతోపాటు కరోనా వైరస్‌ బారిన పడిన వారి వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నది. 


logo