మంగళవారం 19 జనవరి 2021
National - Jan 07, 2021 , 01:42:47

గంగూలీకి మిస్‌"ఫార్చూన్‌'!

గంగూలీకి మిస్‌

ముంబై: ‘గుండెకు ఆరోగ్యాన్నిచ్చే వంట నూనెకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న గంగూలీకి.. గుండెపోటు ఎలా వచ్చిందబ్బా..’  అంటూ మాజీ క్రికెటర్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అనారోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. గంగూలీ అదానీకి చెందిన ఫార్చూన్‌ వంట నూనెలకు ప్రచారకర్తగా ఉన్నారు. ఇటీవల ఆయనకు స్వల్ప గుండెపోటు రావడంతో ఆంజియోప్లాస్టీ చేశారు. దీనిపై ట్రోల్స్‌ వెల్లువెత్తడంతో అదానీ కంపెనీ గంగూలీ ప్రచారకర్తగా ఉన్న యాడ్‌లను నిలిపివేసింది.