శుక్రవారం 03 జూలై 2020
National - Jul 01, 2020 , 09:41:49

వెంకయ్య అధ్యక్షతన విధులు నిర్వహించడం అదృష్టం : సంతోష్‌కుమార్‌

వెంకయ్య అధ్యక్షతన విధులు నిర్వహించడం అదృష్టం : సంతోష్‌కుమార్‌

హైదరాబాద్‌ : ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ముప్పవరపు వెంకయ్య నాయుడు జన్మదినం నేడు. 72వ వసంతంలోకి ఆయన నేడు అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు వెంకయ్యనాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వెంకయ్యనాయుడికి టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ఎంపీ స్పదిస్తూ... తాను కలిసిన ప్రతీసారి ప్రేమ, ఆశీర్వాదాలను సమృద్ధిగా కురిపించే వ్యక్తి అన్నారు. ఈ అద్భుతమైన వ్యక్తి అధ్యక్షతన తాను అధికారిక విధులను నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మంచి ఆరోగ్యం, అద్భుతమైన జీవితాన్ని భగవంతుడి ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు.


logo