శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 02:20:24

జశ్వంత్‌ కన్నుమూత

జశ్వంత్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు జశ్వంత్‌సింగ్‌ (82) ఆదివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఏడాది జూన్‌ 25న ఢిల్లీలోని సైనిక దవాఖానలో చేరారు. ఆదివారం ఉదయం 7గంటల సమయంలో గుండెపోటు రావటంతో మరణించారని దవాఖాన వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. భారతసైన్యంలో మేజర్‌ హోదాలో పనిచేసిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. జశ్వంత్‌సింగ్‌ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర సంతాపం తెలిపారు.