శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 20:38:32

మాజీ కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్

మాజీ కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ బీ జనార్ధ‌న పూజారికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యాధికారులు ఆదివారం వెల్ల‌డించారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయ‌న మంగ‌ళూరులోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చేరారు. 

పూజారికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ‌పై ఆయ‌న కుమారుడు సంతోష్ జే పూజారి స్పందించారు. నాన్న ఆరోగ్యంపై ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్ద‌ని, ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగానే పూజారి ఆస్ప‌త్రిలో చేరార‌ని స్ప‌ష్టం చేశారు. 

క‌ర్ణాట‌క‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,925 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ర్టంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,474కు చేర‌గా, మృతుల సంఖ్య 372కు చేరింది. మొత్తం క‌రోనా కేసుల్లో 13,251 కేసులు యాక్టివ్ గా ఉన్న‌ట్లు క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.


logo