శుక్రవారం 05 జూన్ 2020
National - Jan 26, 2020 , 02:19:59

ఢిల్లీ తొలి మహిళా సీఎం

ఢిల్లీ తొలి మహిళా సీఎం

సుష్మా స్వరాజ్‌ 1952 ఫిబ్రవరి 14న పంజాబ్‌లో జన్మించారు. 1973 లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీ సును ప్రారంభించారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో జనసంఘ్‌ పార్టీ (ఇప్పటి బీజేపీ)లో చేరారు. ఆ తర్వాత హర్యానా అసెంబ్లీకి మూడు సార్లు ఎన్నికయ్యారు. 1998లో ఢిల్లీకి మొదటి మహిళా సీఎంగా పనిచేశారు.ఏడుసార్లు ఎంపీగా గెలుపొందిన సుష్మ వాజపేయి హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014-19 మోదీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి.. ఎందరో భారతీ యులకు ఆపన్న హస్తం అందించారు. గుండెపోటుతో గతేడాది ఆగస్టు 6న ఆమె మరణించారు.  


logo