శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 09:34:11

తమిళనాడు మాజీ మంత్రి కన్నుమూత

తమిళనాడు మాజీ మంత్రి కన్నుమూత

చెన్నై : తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు కేపీపీ సామి ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేపీపీ సామి మృతిపట్ల డీఎంకే నాయకులు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. 2006 నుంచి 2011 మధ్య కాలంలో తిరువొట్టియూర్‌ నియోజకవర్గం నుంచి సామి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కరుణానిధి కేబినెట్‌లో ఫిషరీస్‌ మంత్రిగా సేవలందించారు. 2011లో అన్నాడీఎంకే నాయకుడి హత్య కేసులో సామితో పాటు ఆయన సోదరుడు అరెస్టు అయ్యారు. 


logo