శనివారం 04 జూలై 2020
National - Jun 18, 2020 , 07:30:53

చైనా ఎంబసీ వద్ద మాజీ సైనికుల నిరసన!

చైనా ఎంబసీ వద్ద మాజీ సైనికుల నిరసన!

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో 20 మంది భారత సైనికులు మరణించటంపై బుధవారం ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం వద్ద మాజీ సైనికోద్యోగులు నిరసన తెలిపారు. మృతవీరుల సంక్షేమ సంఘం బ్యానర్‌తో ఆరేడుగురు మాజీ సైనికులు నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు, సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలకు వ్యతిరేకంగా తీన్‌మూర్తి సర్కిల్‌ వద్ద స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్జేఎం)కు చెందిన 10 మంది కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎస్జేఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


logo