సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 12:59:05

కోవిడ్‌-19తో రాజస్థాన్‌ మాజీ మంత్రి జాకియా ఇనామ్ మృతి

కోవిడ్‌-19తో రాజస్థాన్‌ మాజీ మంత్రి జాకియా ఇనామ్ మృతి

జైపూర్ : క‌రోనా వైర‌స్ కార‌ణంగా రాజస్థాన్ మాజీ మంత్రి జాకియా ఇనామ్ మరణించారు. జాకియా గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. కోవిడ్ భారిన ప‌డ‌టంతో చికిత్స నిమిత్తం జైపూర్‌లోని ఆర్‌యూహెచ్ఎస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నిన్న రాత్రి క‌న్నుమూశారు. టోంక్ నియోజ‌క‌వ‌ర్గం నుండి ఆమె మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. జాకియా ఇనామ్ మృతిప‌ట్ల ఆ రాష్ర్ట సీఎం అశోక్ గెహ్లోట్ విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్ర‌క‌టించారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. 


logo