గురువారం 04 మార్చి 2021
National - Jan 28, 2021 , 20:57:32

బీజేపీలో చేరిన పుదుచ్చేరి మాజీ మంత్రి

బీజేపీలో చేరిన పుదుచ్చేరి మాజీ మంత్రి

న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మాజీ మంత్రి ఏ నమశివాయం, ఆయన అనుచరుడైన మాజీ ఎమ్మెల్యే తీపింతన్, మరో నేత జయకుమార్‌ గురువారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వీరు సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ వీపీ శివకోజుండును కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. 

కాంగ్రెస్‌పార్టీకి చెందిన నమశివాయం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నరన్న ఆరోపణలపై పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణియన్ సోమవారం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ ‌చేశారు. దీంతో నమశివాయం తన అనుచరుడైన ఎమ్మెల్యే తీపింతన్‌తో కలిసి స్పీకర్‌ను కలిశారు. మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనుచరుడు తీపింతన్‌ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం స్థానిక బీజేపీ నేతలతో కలిసి వీరు ఢిల్లీ వెళ్లి ఆ పార్టీలో చేరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo