మంగళవారం 26 జనవరి 2021
National - Dec 24, 2020 , 16:38:39

రేపు భోపాల్‌లో మాజీ ప్రధాని వాజపేయి విగ్రహ ప్రతిష్ఠ

రేపు భోపాల్‌లో మాజీ ప్రధాని వాజపేయి విగ్రహ ప్రతిష్ఠ

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో  శుక్రవారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 25న వాజపేయి జయంతి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. శౌర్యస్మారక్‌ సమీపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న స్థలాన్ని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గురువారం పరిశీలించారు.

గ్వాలియర్‌కు చెందిన ప్రముఖ శిల్పి ప్రభాత్‌ రాయ్‌ వాజపేయి విగ్రహాన్ని మలిచినట్లు భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ కేవీఎస్‌ చౌదరి తెలిపారు. భారత ప్రధానిగా అటల్‌ బిహారీ వాజపేయి మూడు పర్యాయాలు సేవలందించారు. డిసెంబర్‌ 25, 1924లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆయన జన్మించారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి ప్రధాని స్థాయికి ఎదిగారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo