గురువారం 04 జూన్ 2020
National - May 10, 2020 , 22:33:08

ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో  రాత్రి 8.45గంటలకు చేరారు.  మన్మోహన్‌   గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.  మన్మోహస్‌ సింగ్‌కు ఇప్పటికే రెండుసార్లు బైపాస్‌ సర్జరీ జరిగింది.

మన్మోహన్‌ 2004 నుంచి 2014 వరకు ప్రధాన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.గత మూడు దశాబ్దాలుగా మన్మోహన్‌ అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి రాజస్థాన్‌ నుంచి మన్మోహన్‌ పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఏప్రిల్‌ 3 వరకూ ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతారు. 
logo