శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 13:19:49

ఎయిమ్స్‌ నుంచి మన్మోహన్‌సింగ్‌ డిశ్చార్జ్‌

ఎయిమ్స్‌ నుంచి మన్మోహన్‌సింగ్‌ డిశ్చార్జ్‌

ఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కొన్ని కొత్త ఔషధాల వాడకంతో రియాక్షన్‌ వచ్చి జ్వరం రావడంతో ఆదివారం రాత్రి మన్మోహన్‌సింగ్‌ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మన్మోహన్‌సింగ్‌కు కరోనా పరీక్ష కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఫలితం నెగెటివ్‌గా వచ్చిందన్నారు. పూర్తిగా కోలుకున్న మన్మోహన్‌ సింగ్‌ నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి వెళ్లారు. logo