సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 10:32:07

ట్రంప్‌కు విందు.. మన్మోహన్‌ దూరం

ట్రంప్‌కు విందు.. మన్మోహన్‌ దూరం

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ రాత్రి 8 గంటలకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు హాజరుకావాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మన్మోహన్‌ సింగ్‌కు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వానాన్ని మన్మోహన్‌ సింగ్‌ సున్నితంగా తిరస్కరించారు. తాను విందుకు రాలేకపోతున్నానని విచారం వ్యక్తం చేస్తూ.. మన్మోహన్‌ రాష్ట్రపతి భవన్‌కు సమాచారం అందించారు. ఈ విందుకు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించకపోవడంతో.. ఆ పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. ఇక ట్రంప్‌కు ఇచ్చే విందులో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ విందులో సీఎం కేసీఆర్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, హర్యానా, అసోం, బీహార్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాల సీఎంలు పాల్గొననున్నారు. 


logo