మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 03, 2020 , 19:14:53

మాజీ మంత్రి ఇంట్లో దోపిడీ

మాజీ మంత్రి ఇంట్లో దోపిడీ

బాగల్‌కోట్‌ :  కర్ణాటకలో ఏకంగా ఓ మాజీ మంత్రి ఇంటినే దొంగలు దోచేశారు. బాగల్‌కోట్ జిల్లా రబ్‌కావి పట్టణంలోని నివాసముండే మాజీ మంత్రి, కన్నడ సినీనటి ఉమశ్రీ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి దోపిడీకి పాల్పడ్డారు. ఉమశ్రీ బెంగళూర్‌లోని రాజేశ్వరీ నగర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఉమశ్రీ సహాయకులు సమాచారం  ఇవ్వడంతో టెరాడాల్ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.

దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు బాగల్‌కోట్‌ ఎస్పీ లోకేశ్‌ జగలాసర్‌ తెలిపారు. మాజీ మంత్రి బెంగళూర్‌లో ఉండటంతో ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. చోరీకి గురైన విలువైన వస్తువుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.