గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 16:38:53

టీడీపీకి భారీ షాక్‌.. మరో మాజీ మంత్రి రాజీనామా

టీడీపీకి భారీ షాక్‌.. మరో మాజీ మంత్రి రాజీనామా

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీకి భారీ షాక్‌ తగిలింది.  ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపిన ఆయన టీడీపీ అధిష్టానం వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు.  సుధీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న డొక్కా.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు.  త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతారని సమాచారం. శాసన మండలి సమావేశాలకు ముందే ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు కూడా వచ్చాయి. 


logo