గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 11:07:43

కర్ణాటక మాజీ మంత్రి కన్నుమూత

కర్ణాటక మాజీ మంత్రి కన్నుమూత

బెంగళూరు : కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్‌ నాయకులు సి. చనిగప్ప శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చనిగప్ప.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చనిగప్ప మృతిపట్ల జేడీఎస్‌ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోరటాగిరి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు చనిగప్ప. అటవీశాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. చనిగప్ప తనకు ఎంతో మంచి స్నేహితుడని, ఆయన మృతి తనకు తీరని లోటు అని కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్య పేర్కొన్నారు. చనిగప్ప మృతికి సంతాపం తెలుపుతూ సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు.


logo
>>>>>>