మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 07:28:44

రాజకీయాలకు మాజీ ఐఏఎస్‌ షా ఫైజల్‌ గుడ్‌ బై!

రాజకీయాలకు మాజీ ఐఏఎస్‌ షా ఫైజల్‌ గుడ్‌ బై!

శ్రీనగర్‌: గతేడాది ఐఏఎస్‌కు రాజీనామా చేసి జమ్ముకశ్మీర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జేకేపీఎం) ఏర్పాటుచేసిన షా ఫైజల్‌ సోమవారం తన పార్టీకి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన ట్విట్టర్‌ ఖాతాలో వ్యక్తిగత వివరాలను సవరించడం ద్వారా రాజకీయాలకు దూరం కానున్నట్లు సంకేతాలిచ్చారు. తన రాజకీయ అఫ్లియేషన్‌ను తొలగించారు. దీనిపై సంప్రదించడానికి ఆయన అందుబాటులో లేరు. ఆయన తిరిగి ఐఏఎస్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి అనుగుణంగానే సోమవారం ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో తనను పార్టీ సంస్థాగత కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. 


logo