శనివారం 04 జూలై 2020
National - Jun 27, 2020 , 21:35:35

మాజీ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్

మాజీ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఆ రాష్ర్ట మాజీ ముఖ్య‌మంత్రి శంక‌ర్ సిన్హ్ వ‌ఘేలాకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఆయ‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో హాస్పిట‌ల్ లో చేరాలా? లేదా ఇంట్లోనే ఉండి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే అంశంపై మాజీ సీఎం ఆదివారం నిర్ణ‌యం తీసుకోనున్నారు. 

గుజరాత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 30,771 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1,790 మంది మ‌ర‌ణించారు. అక్క‌డ యాక్టివ్ కేసుల సంఖ్య 6,564 కాగా, 22,417 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


logo