శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 16:31:43

మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్‌ పటేల్‌ శుక్రవారం కొవిడ్‌ -19 పాజిటివ్‌గా పరీక్షించారు. కుటుంబ సభ్యులు ఆయనకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష చేయించగా సానుకూలంగా వచ్చిందని, ఆయనకు  సీటీ స్కాన్ చేయించడంతో పాటుగా, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ పంపారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. 92 ఏళ్ల పటేల్‌కు ఇంతకు ముందు బైపాస్ సర్జరీ జరిగింది. అలాగే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు భరత్‌ ధ్రువీకరించారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఇంతకు ముందు ఆయన బైపాస్‌ సర్జరీ చేయించుకున్నాడని, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతుండడంతో ఆందోళన కలిగించే విషయమని, దీంతో ఆయనను దవాఖానలో చేర్పించాలని నిర్ణయించినట్లు భరత్‌ తెలిపారు. కేశుభాయ్‌ ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారని, వారి నుంచే ఆయనకు కరోనా సోకి ఉంటుందని చెప్పాడు. గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం గాంధీనగర్‌ సెక్టార్‌-19లో నివసిస్తున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.