శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 12:44:26

గుజ‌రాత్ మాజీ సీఎం కేశూభాయ్ ప‌టేల్ క‌న్నుమూత‌

గుజ‌రాత్ మాజీ సీఎం కేశూభాయ్ ప‌టేల్ క‌న్నుమూత‌

హైదరాబాద్‌: గుజ‌రాత్ మాజీ సీఎం కేశూభాయ్ ప‌టేల్ ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 92 ఏళ్లు.  గ‌త నెల‌లో ఆయ‌న కోవిడ్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు.  ఇవాళ తెల్ల‌వారుజామున శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బందిప‌డ్డ ఆయ‌న్ను.. హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే కేశూభాయ్ మృతిచెందిన‌ట్లు హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు ద్రువీక‌రించారు. సెప్టెంబ‌ర్‌లో ఆయ‌న అటెండెంట్‌కు క‌రోనా సోక‌డంతో.. కేశూభాయ్ కూడా వైర‌స్ ప‌రీక్ష చేయించుకున్నారు. 1995లో, ఆ త‌ర్వాత 1998 నుంచి 2001 వ‌ర‌కు గుజ‌రాత్ సీఎంగా కేశూభాయ్ చేశారు. ఆయ‌న అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నిక‌య్యారు.  2012లో బీజేపీని వీడిన ఆయ‌న.. స్వంతంగా గుజ‌రాత్ ప‌రివ‌ర్త‌న్ పార్టీని స్థాపించారు. 2012 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోర ప‌రాభావాన్ని చ‌విచూసింది.  అయితే మ‌ళ్లీ 2014లో ఆ పార్టీ బీజేపీలో చేరింది. జునాఘ‌డ్ జిల్లాలోని విసావాద‌ర్ పట్ట‌ణంలో కేశూభాయ్ 1928లో జ‌న్మించారు.  1945లో ఆయ‌న ఆర్ఎస్ఎస్‌లో చేరారు.  జ‌న్ సంఘ్‌లో కార్య‌క‌ర్త ద్వారా రాజ‌కీయ కెరీర్‌ను ప్రారంభించారు.