శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 02:18:01

రాజ్యసభ సభ్యునిగా గొగొయ్‌ ప్రమాణం

రాజ్యసభ సభ్యునిగా గొగొయ్‌ ప్రమాణం

-నినాదాలు చేస్తూ విపక్షాలు వాకౌట్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ రాజ్యసభ సభ్యునిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు.. ‘వెల్‌కమ్‌ గొగొయ్‌ దాదా’ అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ స్వాగతం పలికారు. గొగొయ్‌కు రాజ్యసభలో చోటు కల్పించడంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ‘సిగ్గుచేటు.. ఇది ఒప్పందమే’ అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్‌, వామపక్షాల సభ్యులు వాకౌట్‌ చేశారు. ఓ సభ్యుడు సభలో ప్రమాణం చేస్తుండగా విపక్షాలు వాకౌట్‌ చేయడం భారత పార్లమెంట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. కాంగ్రెస్‌ హయాంలోనూ మాజీ జడ్జీలను  సభ్యులుగా నామినేట్‌ చేసిన సంగతిని మంత్రి రవి శంకర్‌ గుర్తు చేశారు. అయితే గొగొయ్‌లా పదవీ విరమణ చేసిన నాలుగు నెలలోపు కాదని, ఆరేడు ఏండ్ల తర్వాతనే నామినేట్‌ చేశామని కాంగ్రెస్‌ పేర్కొంది. గొగొయ్‌ సీజేఐగా ఉన్నప్పుడు రఫేల్‌, అయోధ్య, శబరిమలలో మహిళల ప్రవేశం, అసోం ఎన్నార్సీ వంటి కేసులపై చారిత్రక తీర్పులిచ్చారు. గత ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేసిన ఆయనను రాష్ట్రపతి కోవింద్‌ రాజ్యసభకు నామినేట్‌ చేశారు. 


logo