శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 01:18:05

రాజ్యసభకు మాజీ సీజేఐ గొగోయ్‌

రాజ్యసభకు మాజీ సీజేఐ గొగోయ్‌
  • నామినేట్‌ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ రంజ న్‌ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజ్యాంగంలోని 80 అధికరణం ప్రకారం గొగోయ్‌ని రాజ్యసభకు నామినేట్‌ చేయాలని రాష్ట్రపతి నిర్ణయించారు. ‘నామినేటెడ్‌ సభ్యుల్లో ఒకరైన కేటీఎస్‌ తులసీ రిటైర్‌ కావడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది. గతేడాది నవంబర్‌ చివరిలో జస్టిస్‌ గొగోయ్‌ రిటైరయ్యారు. ఆయన సారథ్యంలోని  రాజ్యాంగ ధర్మాసనం   అయోధ్య భూ వివాదం, శబరిమల, రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలైన పిటిషన్లపై తీర్పులు ఇచ్చింది.


logo