శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 14:44:29

మాజీ సీజేఐ రంజ‌న్ గొగోయ్‌కి జ‌డ్‌ప్ల‌స్ సెక్యూరిటీ

మాజీ సీజేఐ రంజ‌న్ గొగోయ్‌కి జ‌డ్‌ప్ల‌స్ సెక్యూరిటీ

న్యూఢిల్లీ: ‌భార‌త సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా-సీజేఐ) జ‌స్టిస్‌ రంజ‌న్ గొగోయ్‌కి కేంద్రం జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ సెక్యూరిటీని క‌ల్పించింది. ఈ మేర‌కు జ‌స్టిస్‌ రంజ‌న్ గొగోయ్‌కి జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్రత క‌ల్పించాలంటూ సెంట్ర‌ల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)కు ఆదేశాలు జారీచేసింది. జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ త‌న హ‌యాంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ప‌లు కీల‌క కేసుల్లో తీర్పులు వెలువ‌రించారు. కాగా, సీజేఐగా ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడిగా నామినేట్ చేశారు. 2020, మార్చి 16 నుంచి ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.    ‌   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo