గురువారం 03 డిసెంబర్ 2020
National - May 09, 2020 , 14:35:38

మాజీ ముఖ్య‌మంత్రి అజిత్ జోగికి గుండెపోటు

మాజీ ముఖ్య‌మంత్రి అజిత్ జోగికి గుండెపోటు

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాజీ ముఖ్య‌మంత్రి అజిత్ జోగి గుండెపోటుతో ఇంట్లోనే కుప్ప‌కూలిపోయారు. కుటుంబ స‌భ్యులు, సిబ్బంది అత‌డిని హుటాహుటిన రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయ‌ణ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వెంటిలేట‌ర్‌పై అజిత్ జోగికి చికిత్స అందిస్తున్న‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. అతని ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంద‌ని ఇప్పుడేమీ చెప్ప‌లేమ‌ని వైద్యులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ జోగి(74) 2000 నుంచి 2003 వ‌ర‌కు ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు.