బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 13:37:32

కోమాలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌జోగి

కోమాలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌జోగి

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కోమాలోకి జారుకున్నారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేశారు.  అజిత్‌జోగి నిన్న తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం శ్రీ నారాయణ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. 2004లో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో అజిత్‌ జోగి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అప్ప‌టి నుంచి ఆయ‌న వీల్‌చైర్‌ కే ప‌రిమిత‌మ‌య్యారు. 2000 సంవ‌త్స‌రం న‌వంబ‌ర్‌లో ఏర్పడిన ఛత్తీస్‌గ‌ఢ్ రాష్ట్రానికి మొద‌టి ముఖ్య‌మంత్రి అయ్యారు. 2003 న‌వంబ‌ర్ వ‌ర‌కు సీఎంగా ప‌నిచేశారు. 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న సొంత‌గా జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌(జే) ప్రాంతీయ పార్టీ పెట్టారు. 


logo