మంగళవారం 14 జూలై 2020
National - Jun 15, 2020 , 17:30:20

ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్‌ నిపుణులు

ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్‌ నిపుణులు

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌(34) ముంబై నగరం బాంద్రా రెసిడెన్సీలోని తన నివాసంలో ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాని రాజ్‌పుత్‌ హత్యకు గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండడంతో సోమవారం ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం అతడి ఇంటికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపేలా సూసైడ్‌ లాంటివి ఇంట్లో లభించలేదని తెలిపారు. సుశాంత్‌ ఉరేసుకోవడంతోనే ఉక్కిరిబిక్కిరై మృతి చెందాడని  ముందస్తు పోస్టుమార్టం నివేదిక చెబుతోందని డిప్యూటీ కమిషనర్‌ అభిషేక్‌ త్రిముఖి పేర్కొన్నారు. కాగా సుశాంత్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఉదయం ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన మృతి పట్ల ఇప్పటికే పలువురు ప్రముఖ బాలీవుడ్‌ నటులు, క్రీడాకారులు, రాజకీయనాయకులు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


logo