ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 16:03:29

మర్కజ్ కోసం వెదికితే బీహార్‌లో విదేశీయుల గుట్టురట్టు

మర్కజ్ కోసం వెదికితే బీహార్‌లో విదేశీయుల గుట్టురట్టు

హైదరాబాద్: బీహార్‌లో మర్కజ్ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారికోసం పోలీసులు సోదాలు నిర్వహిస్తే 70 మంది దాకా విదేశీయుల గుట్టు రట్టయింది. వారికి మర్కజ్ తో సంబంధం లేనప్పటికీ వారివల్ల కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వారంతా రకరకాల దేశాలు తిరిగి ఇక్కడకు వచ్చారు. బీహార్‌లోని వేరువేరు ప్రాంతాల్లో వారంతా గుట్టుచప్పుడు కాకుండా గడుపుతున్నారు. మర్కజ్ గాలింపుల్లో పట్టుబడడంతో బీహార్ పోలీసులు వారికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ చేసే పనిలో పడ్డారు.


logo