సోమవారం 13 జూలై 2020
National - Apr 06, 2020 , 01:06:03

విదేశీ చదువులపై నీలినీడలు

విదేశీ చదువులపై నీలినీడలు

-కరోనా నేపథ్యంలో ఆవిరవుతున్న విద్యార్థుల ఆశలు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విదేశీ చదువులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పలు దేశాలు లాక్‌డౌన్‌లో ఉండటంతో అక్కడి విద్యాసంస్థలు మూతపడగా కొన్ని ఆన్‌లౌన్‌ కోర్సులవైపు మొగ్గుతున్నాయి. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేయాలని భావిస్తున్న దేశంలోని పలువురి విద్యార్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ఇంటర్‌, డిగ్రీ పరీక్షలు వాయిదాపడగా, ఇవి ఎప్పుడు జరుగుతాయో, ఫలితాలు ఎప్పుడు వస్తాయో అన్నదానిపై విద్యార్థుల్లో అయోమయం నెలకొన్నది. మరోవైపు కొన్ని సబ్జెక్టుల్లో వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతను నిర్ణయిస్తామని సీబీఎస్‌ఈ వంటి బోర్డులు ప్రకటించాయి. దీనివల్ల తమ గ్రేడ్లపై ప్రభావం ఉంటుందని, తద్వారా విదేశాల్లో ఉన్నత చదువుకు ఆటంకం కలుగవచ్చని కొందరు ఆందోళన చెందుతున్నారు. వీసాలు, విద్యా రుణాలు  వంటివి జాప్యమయ్యే అవకాశం ఉండటంతో మరికొందరు తమ ప్రణాళికలను మార్చుకుంటున్నారు. విదేశాల్లో కోర్సులు చివరి దశలో ఉన్నవారు వీసాల పొడిగింపు, కొలువుల లభ్యత, విద్యా రుణాల చెల్లింపు వంటి సమస్యలపై ఆందోళన చెందుతున్నారు. 


logo