100 బిలియన్ డాలర్లు పెరిగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు...

ఢిల్లీ: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. నవంబర్13వ తేదీతో ముగిసిన వారానికి 427.7 కోట్ల డాలర్లు పెరిగి 57,277.1 కోట్ల డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు కాగా. గతవారం ఫారెక్స్ నిల్వలు 77.9 కోట్ల డాలర్లు పెరిగి 56,849.4 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్సీఏలు) 552.6 కోట్ల మేర పెరిగి 53,026.8 కోట్ల డాలర్లకు చేరడంతోనే మొత్తం నిల్వలు గరిష్టస్థాయికి చేరినట్లు ఆర్బీఐ తెలిపింది. పసిడి నిల్వలు 123.3 కోట్ల డాలర్ల మేర తగ్గి 3,635.4 కోట్ల డాలర్లకు పరిమితమైంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 148.8 కోట్ల డాలర్లు, నిల్వ స్థితి 466.1 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది.మార్చి 20, 2020 వారం నాటికి ఫారెక్స్ రిజర్వ్స్ 469.9 బిలియన్ డాలర్లుగా ఉంది. నాటి నుంచి102.8 బిలియన్ డాలర్లు పెరిగి 572.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ ,నవంబర్ మధ్య పారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్(ఎఫ్ పీ ఐ)లు రూ.1,40,295 కోట్లకు పెరిగాయి.