మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 09:21:21

ప‌ల్లికాయ‌ల్లో క‌రెన్సీ నోట్లు.. వీడియో చూడాల్సిందే

ప‌ల్లికాయ‌ల్లో క‌రెన్సీ నోట్లు.. వీడియో చూడాల్సిందే

హైద‌రాబాద్‌:  వేరుశ‌న‌గ‌కాయ‌లు, మాంస‌పు ముద్ద‌లు, బిస్కెట్లు.. ఇంకా ప‌లు ర‌కాల తినుబండారాల్లో విదేశీ క‌రెన్సీని దాచిపెట్టి తీసుకువెళ్తున్న ఓ వ్య‌క్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్ర‌యంలో మురాద్ ఆల‌మ్ అనే వ్య‌క్తిని ఈ కేసులో అరెస్టు చేశారు.  ఆ విదేశీ క‌రెన్సీ విలువ సుమారు 45 ల‌క్ష‌లు ఉన్న‌ట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్ల‌డించారు. ప‌ల్లికాయ‌లు, మాంస‌పు ముద్ద‌లు, బిస్కెట్ ప్యాకెట్ల‌లో అత‌ను ఎలా డ‌బ్బును దాచాడో వీడియోలో చూడ‌వ‌చ్చు.  విదేశీ క‌రెన్సీని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆల‌మ్‌ను పోలీసులు క‌స్ట‌మ్స్ అధికారుల‌కు అప్ప‌గించారు.  యూరో, సౌదీ, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌ దేశాల కరెన్సీ ఆ వ‌స్తువుల్లో ఉంది.  


logo