మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 00:42:17

హైటెక్‌ ప్రైవేట్‌ రైళ్లు

హైటెక్‌ ప్రైవేట్‌ రైళ్లు

న్యూఢిల్లీ: ప్రైవేటు రైళ్లలో ఉండాల్సిన సౌకర్యాల వివరాలను రైల్వే బోర్డు బుధవారం ప్రకటించింది. ఎలక్ట్రానిక్‌ ైస్లెడింగ్‌ డోర్లు, భద్రమైన రెండు అద్దాల కిటికీలు, అంధులకు కూడా అర్థమయ్యేలా బ్రెయిలీ సిగ్నళ్లు, అత్యవసర సమయంలో సమాచారం చేరవేసే వ్యవస్థలు, స్టేషన్ల వివరాలు ప్రదర్శించే డెస్టినేషన్‌ బోర్డులు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. పెద్దగా శబ్దంచేయకుండా గంటకు 160కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగెత్తాలని ముసాయిదా నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది. ‘ఈ రైళ్లలో అత్యవసర బ్రేకింగ్‌ వ్యవస్థ ఉండాలి. 35 ఏండ్ల జీవితకాలం ఉండేలా రైళ్లను రూపొందించాలి. బోగీకి రెండువైపులా రెండు చొప్పున నాలుగు ఎలక్ట్రానిక్‌ ద్వారాలు ఉండాలి. ఒక్కో బోగీలో 6 సీసీ కెమెరాలు ఉండాలి’ అని డ్రాఫ్ట్‌లో సూచించారు.  


logo