సోమవారం 25 జనవరి 2021
National - Jan 11, 2021 , 13:37:30

కేంద్ర బ‌డ్జెట్‌.. 1947 త‌ర్వాత తొలిసారి ఇలా..

కేంద్ర బ‌డ్జెట్‌.. 1947 త‌ర్వాత తొలిసారి ఇలా..

న్యూఢిల్లీ: ఈసారి బ‌డ్జెట్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. 1947 త‌ర్వాత తొలిసారి బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను ముద్రించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. దీనికి ఇప్ప‌టికే పార్ల‌మెంట్‌ ఉభ‌య స‌భ‌ల నుంచి ఆమోదం ల‌భించింది. క‌రోనా నేప‌థ్యంలో 100 మందికిపైగా వ్య‌క్తుల‌ను 15 రోజుల పాటు ప్రింటింగ్ ప్రెస్‌లో ఉంచ‌లేమ‌ని ఆర్థిక శాఖ చెప్ప‌డంతో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీంతో బ‌డ్జెట్ సాఫ్ట్ కాపీల‌ను స‌భ్యులంద‌రికీ అందుబాటులో ఉంచుతామ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌న‌వ‌రి 29 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు రెండు విడ‌త‌లుగా జ‌ర‌గ‌నున్నాయి. తొలి విడ‌త‌లో జ‌న‌వ‌రి 29 నుంచి ఫిబ్ర‌వరి 15 వ‌ర‌కు.. రెండో విడ‌త మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు స‌మావేశాలు జ‌రుగుతాయి. జ‌న‌వ‌రి 29న తొలి రోజు స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. 


logo