సోమవారం 23 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 15:31:35

ప్ర‌జ‌లు దేవుళ్లు.. నేను పూజారిని!

ప్ర‌జ‌లు దేవుళ్లు.. నేను పూజారిని!

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతున్న‌ది. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేత‌లు, అభ్య‌ర్థులు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌ జౌరా, మొరెనా బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌లు దేవుళ్ల‌ని, తాను పూజారిన‌ని చెప్పుకున్నారు. 'నా దృష్టిలో ప్ర‌జ‌లు దేవుళ్లు. నేను వారికి పూజారిని. నేను గ‌తంలో రైతులకు జీరో ప‌ర్సెంట్ వ‌డ్డీకి రుణాలు ఇచ్చాను. కానీ సేట్ క‌మల్‌నాథ్ మాత్రం వారి నుంచి ఆ రుణాల‌ను తిరిగి లాగేసుకున్నారు' అని శివ‌రాజ్‌సింగ్ వ్యాఖ్యానించారు.         

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.