బుధవారం 03 జూన్ 2020
National - Apr 04, 2020 , 11:33:06

మానసిక సమస్యలా అయితే కాల్‌ చేయండి ఈ నెంబర్‌కు

మానసిక సమస్యలా అయితే కాల్‌ చేయండి ఈ నెంబర్‌కు

ఢిల్లీ : దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు, వేగంగా విస్తరిస్తున్న ఆ చైన్‌ను తెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డాన్‌ విధించాయి. ప్రజలంతా సామాజిక దూరం పాటించేందుకు రవాణా, పనులు, ఉద్యోగాలు, విందులు, వినోదాలు, టైమ్‌పాస్‌ వ్యవహారాలు అన్ని బంద్‌ అయ్యాయి. ఇక తప్పని పరిస్థితుల్లో అందరూ ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది. దీంతో ఉరుకుల పరుగుల జీవనం కాస్త ఆగిపోయింది. ఈ సమయం ఒకవైపు భార్యభర్తలు, పిల్లలు, వృద్దులు ఒకరొకొకరు కలిసి అందరూ ఒక్కటిగా కుటుంబ జీవనం గడిపేందుకు దోహదపడుతుంది. 

మరోవైపు కొందరిలో మానసిక వేదనలకు కారణం కావొచ్చొ. ఉరుకుల పరుగుల జీవనంలో ఎప్పుడూ పనులపై ఉండేవారికి ఈ సమయం కాస్త భారంగానే గడుస్తుండవచ్చు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ఆరోగ్యశాఖ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేసింది. లాక్‌డౌన్‌ 21 రోజులు కొనసాగుతున్న నేపథ్యంలో శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా సైతం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమంది. మన రోజువారి వ్యవహారాల్లో యోగా, ధాన్యాన్ని కూడా కలుపుకుందామంది. ఎవరైనా మానసికంగా వేదనకు గురైతున్నైట్లెతే నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 08046110007 కు కాల్‌ చేసి సంప్రదించవచ్చని పేర్కొంది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo