శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 13:37:00

భార్య బర్త్‌డే.. కేజ్రీ విక్టరీ..

భార్య బర్త్‌డే.. కేజ్రీ విక్టరీ..

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడోసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన సంతోషం ఒకెత్తు అయితే.. ఇవాళ తన భార్య పుట్టిన రోజు కూడా. ఇలా కేజ్రీవాల్‌కు ఒకే రోజు రెండు పండుగలు కలిసొచ్చాయి.  కేజ్రీవాల్‌ భార్య సునీత ఇవాళ 54వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సునీత అహర్నిశలు కష్టపడింది. ఢిల్లీలోని ప్రతి గల్లిలో సునీత పర్యటిస్తూ ఆప్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచింది. సునీత బర్త్‌డే సందర్భంగా అనిల్‌ సివాచ్‌ అనే యువకుడు ట్వీట్‌ చేస్తూ.. సునీత మేడమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ కుటుంబానికి దేవుడి ఆశీర్వాదం ఉండాలి. మా హీరో(కేజ్రీవాల్‌)కు మీరే బలం. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని సునీతను ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు. ఇక కేజ్రీవాల్‌ను బీజేపీ నాయకులు ఉగ్రవాదితో పోల్చడంతో సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని ఆమె అన్నారు. అనుకున్న విధంగానే ఢిల్లీ ప్రజలు సరైన తీర్పునిచ్చారు. 


logo