శనివారం 06 మార్చి 2021
National - Jan 19, 2021 , 17:16:19

ఎంపీల‌కు జ‌ల‌క్‌.. పార్ల‌మెంట్‌లో ఆహార స‌బ్సిడీ ఎత్తివేత‌

ఎంపీల‌కు జ‌ల‌క్‌.. పార్ల‌మెంట్‌లో ఆహార స‌బ్సిడీ ఎత్తివేత‌

న్యూఢిల్లీ:  పార్ల‌మెంట్‌లో ఉన్న క్యాంటీన్‌లో ఇచ్చే ఫుడ్ స‌బ్సిడీని ఎత్తివేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు. ఇవాళ ఆయ‌న రాబోయే బ‌డ్జెట్ స‌మావేశాల గురించి మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు పార్ల‌మెంట్‌లో ఉన్న క్యాంటీన్‌లో ఎంపీల‌కు స‌బ్సిడీ ప‌ద్ధ‌తిలో భోజ‌న వ‌స‌తి ఏర్పాటు చేశారు. అయితే ఆ స‌బ్సిడీ విధానాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్న‌ట్లు స్పీక‌ర్ బిర్లా తెలిపారు. పార్ల‌మెంట్ స‌బ్సిడీ ఎత్తివేయ‌డం వ‌ల్ల ఏడాదికి 8 కోట్లు ఆదా అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో.. బ‌డ్జెట్ స‌మావేశాల‌ను జ‌న‌వ‌రి 29వ తేదీ నుంచి నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  రాజ్య‌స‌భ స‌మావేశాలు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఇక లోక్‌స‌భ స‌మావేశాల‌ను సాయంత్రం 4 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.  ఎంపీలంద‌రూ క‌చ్చితంగా ఆర్టీ పీసీఆర్ ప‌రీక్ష చేయించుకుని స‌భ‌కు రావాల‌ని స్పీక‌ర్ బిర్లా పేర్కొన్నారు. 


VIDEOS

logo