శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 18:47:23

బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం...!

బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం...!

హైదరాబాద్ : బాలింతలుగా ఉన్నసమయంలో ఇంట్లో ఉండే పెద్దవాళ్లు ఇవి తినాలి.. అవి తినాలని చెబుతుంటారు. దగ్గరుండి వాళ్లే వండి పెడుతుంటారు. ఎందుకంటే ప్రసవం అయిన తర్వాత తల్లులకు ప్రత్యేకమైన ఫుడ్ చాలా అవసరం. బాలింతలు బలమైన ఆహారం తీసుకోవాలి. తల్లీ ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే బాలింతలుగా ఉన్నప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.   బాలింతలు విటమిన్లు, ప్రోటీన్లు ఉండే ఫుడ్ తీసుకుంటేనే బిడ్డ అవి  కూ అందుతాయి. పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు, ఫిష్, ఎగ్స్, లీన్ మీట్... ఇవన్నీ బాలింతలు తీసుకునే రోజువారీ ఆహారంలో ఈ మెనూ తప్పనిసరిగా ఉండాలి.

పప్పులు...

బీన్స్, పీస్, వేరుశనగ, రాజ్మా, ఆల్ఫాల్ఫా, బ్లాక్ బీన్స్, పప్పులు వంటివి ఐరన్, ప్రోటీన్స్‌తో నిండి ఉంటాయి. వెజిటేరియన్ తినేవాళ్లకి ప్రోటీన్స్ కోసం ఇవి మంచి ఆప్షన్స్. అయితే వీటి వల్ల గ్యాస్ కూడా కొంచెం ఫామ్ అవుతుంది.

లిక్విడ్స్...

బాలింతలకి పాలు పడడానికి లిక్విడ్స్ కూడా అవసరం. వీరు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే కూడా లిక్విడ్స్ కావాలి. అందుకే, నీటితో పాటూ జ్యూసులు, సూప్స్, పాలు, మజ్జిగ వంటివి బాగా హెల్ప్ చేస్తాయి. అదే విధంగా ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ వంటి వాటిలో అన్ని న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి ఎనర్జీని ఇస్తాయి. బాలింతలు పాలు, పెరుగు, మజ్జిగ కంపల్సరీగా తీసుకోవాలి. విటమిన్స్ ఏ, డీ, కాలిషియం, ఇందులో ఉంటాయి.

ఎగ్స్.. ఫ్రూట్స్..

ఆకు కూరల్లో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. పాల కూర, బ్రకోలి వంటి ఆకు కూరలు విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ ఉంటాయి. అలాగే కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పైగా వీటిలో క్యాలరీలు తక్కువ. ఇవి తల్లికీ బిడ్డకీ కూడా మంచి చేస్తాయి. సీజనల్ ఫ్రూట్స్‌ను తింటూ ఉండాలి. పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సీ సిజేరియన్ అయిన వారికి మంచి చేస్తుంది. ఎగ్స్‌లో రోజువారీ ప్రొటీన్ అందుతుంది. పైగా ఇందులో విటమిన్ డీ కూడా ఉంటుంది. బిడ్డ మజిల్స్, బోన్స్ బలంగా ఉండడానికి ఇది చాలా అవసరం.

మాంసాహారం..

ఫిష్, చికెన్ వంటి లీన్‌ మీట్‌లో వైటల్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి డీ హెచ్ఏనీ, ఫ్యాటీ ఆసిడ్స్‌ని ప్రొవైడ్ చేస్తాయి. బేబీ నెర్వస్ సిస్టం బాగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. బాలింతలకి వెల్లుల్లి చాలా మంచిది. వెల్లుల్లితో పాలు పడతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఇన్‌ఫెక్షన్స్ ని దూరంగా ఉంచుతుంది. క్యారెట్స్‌లో కార్బోహైడ్రేట్స్, పొటాషియం ఉంటాయి. ఇవి బాలింతలకి కావాల్సిన శక్తిని ఇస్తాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.