గురువారం 04 జూన్ 2020
National - Apr 08, 2020 , 21:59:00

ఎన్జీవోలు, చారిట‌బుల్ ట్ర‌స్టుల పాత్ర కీల‌కం..

ఎన్జీవోలు, చారిట‌బుల్ ట్ర‌స్టుల పాత్ర కీల‌కం..

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లవుతున్న‌నేపథ్యంలో..వేలాది మంది పేద ప్ర‌జ‌లకు ఆహారం సిద్దం చేసి ఇవ్వ‌డంలో ఎన్జీవోలు, చారిట‌బుల్ ట్ర‌స్టులు కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని క‌న్జ్యూమ‌ర్ అఫైర్స్‌, ఫుడ్ అండ్ ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఎన్జీవోలు, చారిట‌బుల్ ట్ర‌స్టులకు ఆహార ధాన్యాలు, గోధుమ‌లు, బియ్యం పంపిణీకి అవాంత‌రాలు ఏర్ప‌డ‌కుండా..ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్)ద్వారా ఈ-వేలంతో సంబంధం లేకుండా అందజేయాల‌ని ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీచేసిన‌ట్లు మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo