శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 21, 2020 , 02:48:42

చెత్త ఇస్తే.. చపాతీ కర్రీ!

చెత్త ఇస్తే.. చపాతీ కర్రీ!

ముంబై: హెడ్డింగ్‌ చదివి షాక్‌ అయ్యారా? మీరు చదివింది నిజమే. అంతకంతకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలకు చెక్‌ పెట్టడానికి మహారాష్ట్ర థానె జిల్లాలోని కళ్యాణ్‌ దోంబివ్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (కేడీఎంసీ) అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఐదు కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీసుకొచ్చిన వారికి ఒక ఫుడ్‌ కూపన్‌ను ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. రూ.30 విలువజేసే ఈ కూపన్‌ను ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లలో ఇస్తే.. చపాతీ, వేడివేడి కూరను ఇస్తారని తెలిపారు. 


logo