శనివారం 28 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 15:46:13

ప్రధాన నగరాల్లో తగ్గిన ఫుడ్ డెలివరీ ఆర్డర్లు ... ఎందుకంటే...?

ప్రధాన నగరాల్లో తగ్గిన ఫుడ్ డెలివరీ ఆర్డర్లు ... ఎందుకంటే...?

ముంబై : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకుదేలైంది. దీంతో కొందరు ఉద్యోగాలు పోగా.. మరి కొన్నిసంస్థలు కనుమరుగయ్యాయి. కొందరు అయితే   వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో పలు మెట్రో నగరాలు కాస్త ఖాళీగామారాయి. ఈ కారణంగా ఆయా నగరాల్లో ఫుడ్ డెలివరీ తీసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో చెబుతున్నాయి. అయితే అదే సమయంలో.. చిన్న నగరాల్లో మాత్రం ఫుడ్ డెలివరీ పెరిగిందట. వైరస్ వల్ల మెట్రో సిటీస్ నుంచి చాలా మంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో చిన్న నగరాల్లో ఫుడ్‌‌‌‌ డెలివరీలు రెట్టింపు అయ్యాయి.

ఈ విషయాన్ని స్విగ్గీ, జొమాటో ప్రకటించాయి. కోల్‌‌‌‌కతా, కొచ్చి, లక్నో, వైజాగ్‌‌‌‌, గువాహటి, మైసూరు వంటి నగరాల్లో కరోనా వైరస్ కన్నా‌ముందుకంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ వెల్లడించింది. అయితే బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో మాత్రం డెలివరీలు పడిపోతున్నాయని చెబుతున్నాయి. సిటీల నుంచి ఆర్డర్ల సంఖ్య తక్కువగా ఉందని జొమాటో పేర్కొంది. చిన్న నగరాల్లోనే బిజినెస్ బాగుందని స్పష్టం చేసింది. గతంలో మెట్రో నగరాల్లో యాప్‌‌ వాడిన వారిలో చాలా మంది ఇప్పుడు చిన్న సిటీల్లో ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. చిన్న నగరాలకు వెళ్లిపోయిన వారిలో మూడింట  ఒక వంతు మంది అక్కడి నుంచే ఆర్డర్లు ఇస్తున్నారని జొమాటో తెలిపింది. పాట్నా, జంషెడ్‌‌‌‌పూర్‌‌‌‌, రాంచీ నుంచి ఆర్డర్లు బాగా వస్తున్నాయట. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి