National
- Dec 30, 2020 , 12:23:21
ఢిల్లీలో దట్టంగా పొగమంచు

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి భారీగా పెరుగుతున్నది. చలికితోడు ఉదయం, రాత్రి వేళల్లో భారీగా పొగమంచు కమ్ముకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలో మంచు తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నది. ఉదయం 10 గంటలైనా వాహనదారులకు రోడ్లపై 100 మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొన్నది. సఫ్దర్గంజ్ ఏరియాలో ఇవాళ కనిష్ఠంగా 3 డిగ్రీ సెల్షియస్, గరిష్ఠంగా 18 డిగ్రీ సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
MOST READ
TRENDING