సోమవారం 08 మార్చి 2021
National - Jan 28, 2021 , 08:44:02

ఢిల్లీని కప్పేసిన మంచుదుప్పటి.. రైళ్లు ఆలస్యం

ఢిల్లీని కప్పేసిన మంచుదుప్పటి.. రైళ్లు ఆలస్యం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని మంచుదుప్పటి కప్పేసింది. దీంతో దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ దృశ్యమానత కారణంగా గురువారం 17 రైళ్లు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నడుస్తున్నాయని నార్తన్‌ రైల్వే(డీ) చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (సీపీఆర్‌ఓ) పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయింది. లోధీ రోడ్ ప్రాంతంలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జఫర్‌పూర్‌లో 4.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం దేశ రాజధానిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 5.4 డిగ్రీలకు చేరగా.. గరిష్ఠ ఉష్ణోగ్రత 21.5 డిగ్రీలుగా నమోదైంది. మంగళవారం రెండు డిగ్రీలకు చేరుకోవడం గమనార్హం. అంతకు ముందు ఆదివారం 15 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత ఆరు డిగ్రీలు తగ్గింది. ఇదిలా ఉండగా.. వాయుకాలుష్యం కొనసాగుతోంది. రాబోయే మూడు రోజుల్లో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

VIDEOS

logo