గురువారం 04 జూన్ 2020
National - Apr 06, 2020 , 12:15:14

ప‌శుగ్రాసం ధ‌ర‌లు రెట్టింప‌య్యాయి...

ప‌శుగ్రాసం ధ‌ర‌లు రెట్టింప‌య్యాయి...

చంఢీగ‌ఢ్‌: దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో ప‌శువుల‌కు దాణా అందించ‌డం క‌ష్టంగా మారింది. ఓ వైపు లాక్ డౌన్ ఎఫెక్ట్‌ , వేస‌వి కాలంలో పశుగ్రాసం, దాణ కొర‌త ఉండ‌టం వంటి కార‌ణాల‌తో ప‌శువుల‌కు అందించే గ‌డ్డి, ఇత‌ర దాణా రేట్లు రెట్టింపవ‌డంతో గోయ‌జ‌మానులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

చంఢీగఢ్ లో ప‌శువుల‌కు స‌రిప‌డా దాణా అందించ‌లేక‌పోతున్నామ‌ని, వెట‌ర్నరీ వైద్యులు కూడా ఎవ‌రూ ప‌శువుల‌ను ప‌రీక్షించేందుకు రావ‌డం లేద‌ని, వారు కూడా ఫీజులు రెట్టింపు చేశార‌ని ఓ య‌జ‌మాని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో చేసేదేమి లేక ప‌శుగ్రాసం త‌క్కువ మొత్తంలో గోవుల‌కు పెడుతున్నామ‌ని చెప్పాడు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo