శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 14:02:07

తగ్గిన శానిటైజర్ల ధరలు..

తగ్గిన శానిటైజర్ల ధరలు..

న్యూఢిల్లీ: దేశంలో నిత్యావసరాల తయారీ కంపెనీలు(ఎఫ్‌ఎంసీజీ) కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా హ్యాండ్‌ శానిటైజర్లు, ఫేస్‌ మాస్క్‌ల  ధరలను తగ్గించాయి.  ప్రముఖ కంపెనీలు కొన్ని వస్తువులపై  70శాతం మేర రాయితీ ప్రకటించాయి.   కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్‌-19 కట్టడికి ప్రజలంతా శానిటైజర్లను వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

శానిటైజర్ల కొరత లేకుండా ఆర్‌బీ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, గోద్రెజ్‌ కన్జ్యూమర్‌, హిమాలయ, డాబర్‌ తదితర కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచాయి.  మార్కెట్లో డిమాండ్‌ అధికంగా ఉండటంతో ధరలు తగ్గించి ఉత్పత్తి పెంచాలని కేంద్రం సూచనలకు అనుగుణంగా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి  200 మిల్లీలీటర్ల హ్యాండ్‌ శానిటైజర్‌ గరిష్ఠ ధరను రూ.100గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ ధర జూన్‌ 30వరకు అమల్లో ఉంటుంది.  


logo