మంగళవారం 31 మార్చి 2020
National - Feb 16, 2020 , 02:40:33

రైతుకు రూ.3 లక్షల వరకు పంట రుణం!

రైతుకు రూ.3 లక్షల వరకు పంట రుణం!
  • నిర్మలాసీతారామన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. రైతులు సంవత్సరానికి ఏడుశాతం వడ్డీ చొప్పున గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. శనివారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేసే దిశగా కీలక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా పలు పథకాల అమలుకు బడ్జెట్‌లో రూ.1.6 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పీఎం కిసాన్‌ పథకానికి రూ.75వేల కోట్లు కేటాయించామన్నారు. బ్యాంకులు రైతులకు అందిస్తున్న రుణాలకు కేంద్రం పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అన్నదాతలకు అందించే రుణ పరిమితిని పెంచినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల లక్ష్యం రూ.13.5 లక్షలకోట్లు కాగా.. 2020- 21లో రూ.15 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ణయించామని వెల్లడించారు. సాధారణంగా ఏటా రుణ లక్ష్యాన్ని 9 శాతం పెంచుతారని, తాము 11 శాతం పెంచామని చెప్పారు.


logo
>>>>>>