శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 01:52:58

ఎగిరే కారు!

ఎగిరే కారు!

న్యూఢిల్లీ: జేమ్స్‌బాండ్‌ సినిమాలు చూశారా.. చిత్రవిచిత్రమైన కార్లకు ఈ సినిమాలు ప్రసిద్ధి. అప్పటిదాకా రోడ్డు మీద రయ్‌ అంటూ దూసుకెళ్తున్న కార్లు ఒక్కసారిగా రెక్కలు వచ్చి గాల్లోకి ఎగురుతాయి. అలాంటి కారు నిజంగానే మార్కెట్‌లోకి రాబోతున్నది. స్లోవేకియాకు చెందిన క్లెయిన్‌ విజన్‌ అనే కంపెనీ ఎగిరే కారును అభివృద్ధి చేసింది. దీనికి ‘ఎయిర్‌ కార్‌' అని పేరు పెట్టారు. ఇటీవల కారును విజయవంతంగా పరీక్షించారు. దీని బరువు 1,100 కిలోలు. 200 కిలోల వరకు మోసుకెళ్లగలదు. నవంబర్‌లో నిర్వహించనున్న ‘చైనా ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్‌'లో రెండు మోడళ్లను ప్రదర్శనకు పెట్టనున్నారు. కారు వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రావచ్చు. సంస్థ దాదాపు 30 ఏండ్లు కష్టపడి ఈ కారును తయారు చేయడం విశేషం.