గురువారం 01 అక్టోబర్ 2020
National - Sep 09, 2020 , 13:14:05

ఆరెంజ్ జ్యూస్ కోసం గొడ‌వ‌ప‌డి అమ్మ‌ను చంపాడు!

ఆరెంజ్ జ్యూస్ కోసం గొడ‌వ‌ప‌డి అమ్మ‌ను చంపాడు!

ఫ్లోరిడా: అమెరికాలో దారుణం జ‌రిగింది. చిన్న విష‌యానికే గొడ‌వ‌ప‌డి ఓ వ్య‌క్తి త‌ల్లిని హ‌త‌మార్చాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం నార్త్ మియామీ బీచ్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నార్త్ మియామీ బీచ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో లూయిస్ పేజెస్ (29), త‌ల్లి మిరియ‌మ్ (59)తో క‌లిసి ఉంటున్నాడు. అయితే, త‌న‌కు ఉద్యోగం వెతుక్కోవ‌డం కోసం కారు కావాల‌ని అడిగాడు. అందుకు త‌ల్లి కాద‌ని చెప్పింది. 

ఈ విష‌యంలో ఇద్దరూ గొడ‌వ‌ప‌డ్డారు. త‌ర్వాత లూయిస్ పేజెస్ త‌ల్లిన ఏసీ రిమోట్ అడిగాడు. అయితే ఆమె ఇవ్వ‌లేదు. మ‌ళ్లీ ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. కొద్దిసేప‌టి త‌ర్వాత‌ ఫ్రిజ్‌లో ఉన్న ఆరంజ్ జ్యూస్ తీసుకుని తాగ‌బోయాడు. అయితే, అప్పటికే కోపంగా ఉన్న మిరియం జ్యూస్ జార్ తీసుకుని విసిరికొట్టింది. దీంతో ఆగ్ర‌హానికి లోనైన పేజెస్ త‌న జేబులో ఉన్న రివాల్వ‌ర్ తీసి త‌ల్లిని కాల్చిచంపాడు. అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చి లొంగిపోయాడు.  

పోలీసుల విచార‌ణ‌లో జ‌రిగిందంతా వివ‌రించాడు పేజెస్‌. తాను కోపంలో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాన‌ని, అనంత‌రం త‌న‌ను తాను కాల్చుకుందామ‌ని చూసేస‌రికి అందులో బుల్లెట్‌లు లేవ‌ని చెప్పాడు. క్ష‌ణికావేశంలో తాను పెద్ద త‌ప్పు చేశాన‌ని ఒప్పుకున్నాడు. త‌న అనాలోచిత ప్ర‌వ‌ర్త‌నతో స‌ర్వం కోల్పోయాన‌ని విల‌పించాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo